పేకాట స్థావరంపై పోలీసుల దాడి..
20-07-2026 02:13 PM
ప్రభుత్వ ఉద్యోగులు సహా ఏడుగురిపై కేసు
బిజినేపల్లి, జూలై 20: మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి ప్రభుత్వ ఉద్యోగులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.55,200 నగదు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై జూద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై శంషూద్దీన్ తెలిపారు. పట్టుబడిన వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.






