5 August, 2026 | 3:39 AM

బాస్కెట్‌బాల్ కోచ్‌పై పోక్సో కేసు

05-08-2026 12:00 AM

టోర్నమెంట్‌లో బాలికపై అసభ్య ప్రవర్తన

దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు

శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (విజయక్రాంతి): టోర్నమెంట్ల సమయంలో బాలికకు అసభ్యంగా సైగలు చేసి, లైంగిక స్వభావం గల వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్‌రెడ్డిపై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా గత నెల 24న ఆర్సీపురం పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, అదే రోజు దానిని మాదాపూర్ ఠాణాకు బదిలీచేశారు. ఫిర్యాదును పరిశీలించిన మాదాపూర్ పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పృథ్వీశ్వర్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.