5 August, 2026 | 4:40 AM

దేశాభివృద్ధి, భద్రతకే ప్రాధాన్యం

05-08-2026 12:00 AM
  1. త్యాగధనులను విస్మరించిన కాంగ్రెస్
  2. యూపీఏ పాలనంతా కుంభకోణాల మయం
  3. న్యూజెర్సీలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): దేశాభివృద్ధి, భద్రతే తమకు ప్రాధాన్యమని,- కుటుంబ పాలన నుంచి దేశం ‘నేషన్ ఫస్ట్’ దిశగా పయనమవుతోందని, పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రతీ ఒక్కరూ నేషన్ ఫస్ట్ (దేశమే ప్రథమం) అనే భావనతో ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ప్రవాస భారతీయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మంగళవారం నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యూపీఏ పాలనంతా కుంభకోణాలమయంగా ఉండేదని, పేరుకే ప్రధానిగా మన్మోహన్ ఉన్నారని, నిర్ణయాధికారమంతా సోనియా చేతిలోనే ఉండేదనే భావన ఉండేదన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ దిశ పరివర్తన చెందిందని రాంచందర్‌రావు అన్నారు.