27 June, 2026 | 2:26 PM

బాన్సువాడ కల్కి చెరువు కట్టకు బుంగ...

27-06-2026 01:31 PM

మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం...

బాన్సువాడ, జూన్ 27 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా బాన్సువాడ కల్కి చెరువుకు(Kalki Cheruvu repair works)  బుంగ మరమ్మతు పనులను శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో(Pocharam Srinivas Reddy) పాటు ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ముంగ మరమ్మతు పనుల కోసం రూ. 27 లక్షల 60 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు.పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి అనుగుణంగా పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.చెరువు ద్వారా రైతులకు సాగునీరు అందుతున్నందున మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేసి నీటి వృథాను అరికట్టాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ పరిశీలనలో ఇరిగేషన్ డి ఈ శ్రీ చంద్, ఏఈ నితిన్, ప్రజా ప్రతినిధులు మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ నాయకులు ఎరవాల కృష్ణారెడ్డి నార్ల సురేష్ బాబా రవీందర్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులు ఉన్నారు.