27 June, 2026 | 3:23 PM

సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.

27-06-2026 02:08 PM

సత్తుపల్లి. జూన్ 27. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు తుమ్మూరి రామారావు వీధిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వాన్నంగా మారింది. డ్రైనేజీలు కలుపు మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి మురుగునీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో దుర్వాసన వెదజల్లుతూ, దోమలు విపరీతంగా పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు, స్థానిక 19వ వార్డు కౌన్సిలర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. పన్నులు వసూలు చేయడంలో ముందుండే మున్సిపాలిటీ, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎందుకు వెనుకబడుతోంది.