27 June, 2026 | 3:18 PM

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం

27-06-2026 02:06 PM

బతికిన పత్తి మొలకలు.. 

ఖమ్మం, విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని(Khammam district) ఆయా ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు దాటినప్పటికీ వర్షాలు జాడలేకుండా పోయాయి.  అక్కడక్కడ అరకొరగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు చినుకులకే పత్తి గింజలు పెట్టి, ఆకాశం వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో ఎలినోనా ప్రభావం ఉంటుందని ప్రజలు రైతులు అభిప్రాయపడ్డారు కానీ ఈ క్రమంలో అసలూ వర్షాలు రావేమో అనుకుంటున్న సమయంలో శనివారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో తల్లాడ, కామేపల్లి, కొణిజర్ల, రఘునాథపాలెం, కూసుమంచి మండలంలో భారీ వర్షం పడింది. మిగిలిన మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. దీంతో రైతులు సాగు చేసిన పత్తి విత్తనాలు మొలకెత్తాయి. మొలకెత్తిన పత్తి మొలకలు బ్రతికినట్లేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..