27 June, 2026 | 3:18 PM

అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి

27-06-2026 02:20 PM

నిర్మల్ జూన్ 27 ( విజయ క్రాంతి): సో న్ మండల కేంద్రంలో గల కేజీబీవీ కళాశాలలో అతిథి ఉపాధ్యాయుల కోసం అరులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఓ లతా దేవి తెలిపారు. ఇంటర్మీడియట్ ఎం పి హెచ్ డబ్లు కోర్సులు విద్యా బోధనకు బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ చదువు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలను సోమవారం లోపు కేజీబీవీ పాఠశాలలో అందించాలని ఆ తర్వాత మెరిట్ డెమో ఆధారంగా అతిథి ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ఎస్ఓ సూచించారు.