27 June, 2026 | 3:22 PM

రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!

27-06-2026 02:19 PM

రేపటి నుంచి గట్లమల్యాల పీహెచ్‌సీ పరిధిలో పల్స్ పోలియో

నంగునూరు, (విజయక్రాంతి): పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు డాక్టర్ విపిన్,డాక్టర్ శివకుమార్ లు తెలిపారు.గట్లమల్యాల పీహెచ్‌సీ పరిధిలోని 13 గ్రామ పంచాయతీల్లో ఉన్న 0-5 ఏళ్ల లోపు వయస్సు గల 1,334 మంది చిన్నారులందరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు, నిర్దేశిత పోలియో కేంద్రాల్లో చుక్కలు వేస్తారు.ఆ రోజు కేంద్రాలకు రాలేని చిన్నారుల కోసం సోమ,మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్‌కు భరోసా కల్పించాలని వారు కోరారు.