ప్రమాదానికి మద్యం మత్తే కారణం
27-06-2026 02:12 PM
కోదాడ జాన్ 27, (విజయ క్రాంతి): కోదాడ: పట్టణంలోని శ్రీరంగాపురం సమీపంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఇద్దరు వలస కూలీలు మృతి చెందిన ఘటనలో మద్యం మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. మృతులు బీహార్‌కు చెందిన రాజేష్, శివాజీగా గుర్తించారు. వీరు గత రెండేళ్లుగా కోదాడలోని ఓ రైస్‌మిల్లులో హమాలీలుగా పనిచేస్తున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలోనే ఇద్దరూ మృతి చెందినట్లు తేల్చారు. ఈ విషయాన్ని పట్టణ సీఐ శివశంకర్ నాయక్ వెల్లడించారు.






