నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
కూసుమంచి, (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో శనివారం ఒక పక్క నిండు వర్షం కురుస్తున్న అప్పటికి రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జడ్పీ రోడ్డు గైగోళ్ళపల్లి నుండి దుబ్బతండా వరకు రూ.210.26 లక్షల అంచనా వ్యయంతో నూతన చేపట్టనున్న బి.డి. రోడ్డు నిర్మాణం, ఆనతరం దుబ్బతండ వయా కొత్తూరు–ఎర్రగడ్డ తండా వరకు బి.సి. రోడ్డు నిర్మాణానికి రూ.450 లక్షలు, అలాగే లాల్ సింగ్ తండా నుండి నేరడవాయి వరకు బి.సి. రోడ్డు నిర్మాణానికి రూ.203.69 లక్షలు మంజూరు చేసి పనులకు, తర్వాత కొండాపురం నుండి మోటాపురం రోడ్డుపై రూ.750 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణం కు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రైతులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దినేని స్వరకుమారి, ఎండీ. హాఫీజుద్దిన్, బజ్జూరి వెంకట్ రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, సర్పంచ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు






