1 March, 2026 | 6:57 PM

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పోచారం

01-03-2026 02:43 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ లబ్దిదారులు 178 మందికి రూ 1,78,20,648/- ల చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

బాన్సువాడ గ్రామీణ మండలం 54 మంది  లబ్ధిదారులకు రూ 54,06,264/- బాన్సువాడ పట్టణం 30 మంది లబ్ధిదారులకు రూ 30,03,480/-నసురుల్లబాద్ మండలం 74 మంది లబ్దిదారులకు రూ 74,08,584/-బీర్కూర్ మండలం 20 లబ్ధిదారులకు రూ 20,02,320/-పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ, బాన్సువాడ గ్రామీణ మండల, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.