నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు కుభీర్ విద్యార్థి ఎంపిక
కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సైఫుల్ల ఖాన్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు (ఎన్ఎంఎంఎస్) ఎంపికయ్యారు. మండల కేంద్రం కుభీర్ కు చెందిన షాబాజ్ ఖాన్ -నూర్జహా దంపతుల కుమారుడు సైఫుల్ల ఖాన్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతూ గతేడాది నవంబర్ లో నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షక రాశాడు. 28వ తేదీ ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి.
మొదటి నుండి చదువుల్లో ప్రథమ స్థానంలో నిలిచే సైఫుల్లా ఖాన్ NMMSకు ఎంపిక కావడంతో అతనికి ఉన్నత చదువులకోసం ప్రతి విద్యా సంవత్సరం రూ.12వేల చొప్పున కేంద్ర ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ స్కాలర్షిప్ను అందజేయనుంది. విద్యార్థి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సట్ల గంగాధర్, గైడ్ టీచర్ బారే శ్రీనివాస్, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్ తదితరులు అభినందించారు. ముధోల్ నియోజకవర్గం లోని అన్ని పాఠశాలల నుండి విద్యార్థులు ఈ పరీక్షలు రాసినప్పటికీ తాండూరు మండలం బోసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ఒకరు కుభీర్ నుండి సైఫుల్లా ఖాన్ ఎంపిక కావడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు.




