భూపాలపల్లిలో ఘనంగా పోచమ్మతల్లి బోనాల జాతర
* భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కుమ్మరి సంఘం, ఆలయ కమిటీ
*బోనాలతో ఊరేగింపుగా తరలి వెళ్లిన మహిళలు
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 2 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సహకారంతో పోచమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా శివసత్తులు పూనకాలతో బోనాలను పోచమ్మ ఆలయం వరకు తీసుకువెళ్లగా, భక్తజనం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తమ కుటుంబాలు, పిల్లపాపలు, పాడి పంటలు సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలని పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు భక్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నడిగూడ జయంత్ రావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓదెల చందర్రావు సూర్యాపేట జిల్లా టౌన్ అధ్యక్షులు చలిగంటి నాగయ్య జిల్లా అధ్యక్షులు కొండపర్తి ఇస్తారు జిల్లా గౌరవ అధ్యక్షులు నాంపల్లి ఐలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బిక్కునూరు సుదర్శన్ దుబాసి బాలరాజు జిల్లా కోశాధికారి నాంపల్లి అశోక్ ముప్పారపు నరేష్ యూత్ టౌన్ అధ్యక్షులు కాసర్ల కృష్ణంరాజు భూపాలపల్లి మండల అధ్యక్షుడు ఇటుకల రమేష్ లు పాల్గొన్నారు.






