3 August, 2026 | 2:18 AM

16న ఘనంగా బోనాల ఉత్సవాలు

03-08-2026 01:10 AM

ప్రగతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాలనరసింహ

జవహర్ నగర్, ఆగస్టు 2 (విజయక్రాం తి): పండుగలు ఐక్యమత్యానికి, భక్తి భావానికి చిహ్నాలని ప్రగతినగర్ వెల్ఫేర్ అసో సియేషన్ కమిటీ అధ్యక్షులు చిన్నం బాల నరసింహ పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని ప్రగతి నగర్ లో  ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం ఆదివారం నల్లపోచమ్మ గుడి ప్రాంగణంలో నిర్వహించారు.

కార్యక్రమం లో కమిటీ అధ్యక్షులు చిన్నం బాల నరసిం హ మాట్లాడుతూ  మాట్లాడుతూ పండుగ లు ఐక్యమత్యానికి చిహ్నాలని సోదర భావానికి భక్తికి ఆనవాళ్ళని తెలిపారు. ప్రగతి నగర్ లో ఈనెల 16వ తేదీన తెలంగాణలో ఘనమైన పండుగగా పేరుగాంచిన బోనాల ఉత్స వాలను 16వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పండుగ తేదీలను ఏక గ్రీవంగా కమిటీ సభ్యులచే నిర్ణయించామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆనందదాస్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి కాటా శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ బి. లక్ష్మీబాయి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమార స్వామి, కోశాధికారి చుక్కా యాదగిరి, కడారి గణేష్, వెంకటేష్, జోజి కుమార్, శివప్రసాద్, వీరభద్రరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.