3 August, 2026 | 3:39 AM

గాంధీనగర్‌లో బోనాల సందడి

03-08-2026 01:09 AM

అమ్మవారికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూజలు

ఉప్పల్ , ఆగస్టు 2 (విజయక్రాంతి): కా ప్రా డివిజన్ గాంధీనగర్లో నిర్వహించిన ఆ షాఢ బోనాల మహోత్సవాలు ఆదివారం భ క్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సం దర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగా ణ ఆత్మను ప్రతిబింబించే మహోన్నత సాం స్కృతిక, ఆధ్యాత్మిక ఉత్సవమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉం డాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ప్రజలపై అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాలు కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ సంప్రదాయాలను, సంస్కృతిని భావితరాలకు చేరవేసే గొప్ప వారసత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పండుగల ద్వారా సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల కోలాహలం, సంప్రదాయ బోనాలు, పోతరాజుల విన్యాసాలతో గాంధీనగర్ ప్రాంతం పండుగ వాతావరణంతో కళకళలాడింది.