5 August, 2026 | 2:43 AM

పెద్దదర్పల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

05-08-2026 01:40 AM

హన్వాడ ఆగస్టు 4 (విజయక్రాంతి): మండలంలోని పెద్దదర్పల్లి గ్రామంలో మంగళవారం శ్రీ పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువత, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం తమ మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఉత్సవాల్లో భాగంగా బ్యాండు మేళాల నడుమ యువకులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ గ్రామమంతా ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించారు. గ్రామ ప్రజలందరూ భక్తి, ఆనందోత్సాహాల మధ్య బోనాల వేడుకలను ఘనంగా జరుపుకోవడంతో పెద్దదర్పల్లి పండుగ శోభతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ఈ వేడుకల్లో సర్పంచ్ దీప్తి రఘురాం గౌడ్, వార్డు మెంబర్లు తదితరులు ఉన్నారు.