5 August, 2026 | 2:43 AM

విద్యార్థుల్లో నాయకత్వ వికాసానికి శ్రీ నారాయణ హైస్కూల్లో మాక్ ఎన్నికలు

05-08-2026 01:40 AM

గణపురం ఆగస్టు 4 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ నారాయణ హైస్కూల్లో విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మాక్ ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. భారతదేశంలో అమలవుతున్న ఎన్నికల విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల నిర్వహణ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ విధానాలను అనుసరిస్తూ ఈ ఎన్నికలు నిర్వహించగా, విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా చైర్మన్ నాగనబోయిన రవి, కరస్పాండెంట్ పోతుగంటి శశిధర్ చారి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్కు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో బాలుర హెడ్ బాయ్గా డి. ఉదయ్ తేజ్, హెడ్ గర్ల్గా కె. సాత్విక, స్కూల్ ప్యూపిల్ లీడర్గా ఎండి. కరిష్మా, డిసిప్లిన్ లీడర్గా డి. జస్వంత్ ఎన్నికయ్యారు. వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పోతుగంటి స్వప్న చారి, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.