23 July, 2026 | 2:50 AM

కూసుమంచిలో పీఎం దిష్టిబొమ్మ దహనం

23-07-2026 12:00 AM

కూసుమంచి, జులై 22(విజయ క్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత ,పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ  అరెస్టుకు నిరసనగా కూసుమంచి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టి  ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహ నం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రతిపక్ష నాయకులపై రాజకీయ కక్షసాధింపు చర్యలను విరమించుకో వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయించాలని, విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.