23 July, 2026 | 1:25 AM

ఆదివాసి వేడుకల్లో లంబాడీలకు అనుమతి లేదు

23-07-2026 12:00 AM

తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కోడెం నరసింహారావు

చండ్రుగొండ,జులై 22 ( విజయక్రాంతి ): ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవ వే డుకల్లో లంబాడీలు పా ల్గొనే అనుమతి లేదని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కోడెం నరసింహారావు బుధవారం పత్రిక ప్రకటన ద్వారా  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1976-77 సంవత్సరంలో ఎ స్టీ జాబితాలో చేరి  1950 సంవత్సరం నుండి ఉన్నట్టుగా ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది ఆదివాసులకు రావాల్సిన రిజర్వేషన్, ఉద్యోగ అవకాశాలను దొంగ దారిలో పొందుతూ ఆ దివాసికి చెందాల్సిన రిజర్వేషన్లు లంబాడీలు అనుభవిస్తున్నారన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితాలోంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకల్లో ఆదివాసులు మాత్రమే పాల్గొనాలని, లంబాడీలు పాల్గొనే అనుమతి లేదని ఆయన తేల్చిచెప్పారు.