24 April, 2026 | 9:05 PM

ఖానాపూర్‌ను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించండి

24-04-2026 07:23 PM

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోనే ఖానాపూర్ మున్సిపాలిటీ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ జిల్లా కలెక్టర్కు విన్నవించారు. శుక్రవారం జిల్లా కేంద్రం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆకాంక్షించారు. వారితో పాటు ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, గుమ్ముల ఆనంద్, నాయకులు బండిపల్లి ప్రకాష్ గౌడ్ ,తదితరులు ఉన్నారు.