తెలంగాణకు నూతన డీజీపీగా సీవీ ఆనంద్
24-04-2026 07:20 PM
హైదరాబాద్: తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ గా ఐపీఎస్ సీవీ ఆనంద్ నియమకం. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శవధర్ రెడ్డి ఏప్రిల్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పూర్తికాలపు డీపీజీ ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసి ఐదుగురు సీనియర్ ఐపీఎస్ ల పేర్లను యూపీఎస్పీకి లిస్టును పంపించింది. దీంతో ముగ్గురిని సిఫార్సు చేస్తూ యూపిఎస్సీ నిర్ణయం తీసుకుంది. వీరిలో ఐపీఎస్ సీవీ ఆనంద్ ని తెలంగాణ నూతన డీపీజీగా నియమించే అవకావం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ ఉన్నారు. తాజాగా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శిఖా గోయల్ ని ప్రభుత్వం నియమించింది.






