Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీపై సుప్రీంలో పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టులో(Supreme Court) పిల్ దాఖలైంది. న్యాయవాది రాజేశ్ సింగ్ చౌహాన్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాక్రోచ్ పార్టీ(Cockroach Party) పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయని పిటిషన్ వేశారు. సీజేఐ వ్యాఖ్యల ఆధారంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్ తెలిపారు. సీజేఐ వ్యాఖ్యల అర్థాలు(CJI's Remarks) మార్చి వైరల్ చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. డబ్బు సంపాదించే కంటెంగ్ గా మార్చే ధోరణి పెరుగుతోందని న్యాయవాది సుప్రీంకు తెలిపారు.
నకిలీ న్యాయ డిగ్రీలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిల్ పై అత్యవసర విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్(Chief Justice of India Surya Kant) సోమవారం న్యాయవాదులను "అంత భావోద్వేగంతో" స్పందించవద్దని కోరారు. ప్రధాన న్యాయమూర్తి (CJI) కాంత్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, VM పాంచోలి సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ విషయంలో అంత తీవ్రమైన ఆవశ్యకత ఏదీ లేదని పిటిషన్లను తగిన సమయంలో పరిశీలిస్తామని పేర్కొంది.






