26 May, 2026 | 2:44 AM

ఒప్పందం కుదిరే వరకూ హోర్ముజ్ దిగ్బంధం

26-05-2026 12:00 AM
  1. ఇరాన్‌తో ఒప్పందానికి తొందర లేదు
  2. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 

వాషింగ్టన్, మే 25: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం డీల్ కుదిరే వరకూ కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో ఒ ప్పందానికి ‘మేం ఏమీ తొందరపడటం లేదు’ అని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అమెరికా అధికారులు చర్చల కోసం తగినంత సమ యం తీసుకోవాలని సూచించారు. టెహ్రాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా చాలా గొప్ప గా ఉంటుందని, తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే ఇందులో ముందడుగు ఉంటుందని పేర్కొన్నారు.

ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా చాలా గొప్పగా ఉంటుందని.. లేదంటే అసలు ఉండదన్నారు.  తమ నేతలు ఇరాన్ ముందు ఉంచిన ప్రతిపాదనలకు ఆ దేశం అంగీకరిస్తేనే ఈ విషయంలో ముందడుగు వేస్తామన్నారు. ప్రస్తుతం చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని.. ఈ విషయంపై గల్ఫ్ దేశాల అధినేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. టెహ్రాన్ తాము కుదుర్చుకోబోయే ఒప్పందంపై ఎ టువంటి అవగాహన లేని డెమోక్రాట్లు త మ యంత్రాంగాన్ని విమర్శిస్తుండడం నవ్వు తెప్పిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. 

గతంలో ఒబామా, ఆయన యంత్రాంగంలోని అనుభవం లేని అధికారులు ఇరాన్ అణు ఒప్పందాన్ని ప్రతిపాదించి, అమలులోకి తెచ్చారని విమర్శిం చారు. వారు చేసుకున్న ఒప్పందానికి.. తా ము జరుపుతున్న చర్చలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇరాన్‌కు ‘అణు’ శక్తిని అందించే ఒప్పందాలను అంగీకరించబోనని స్పష్టం చేశారు.

వాస్తవానికి ఇరాన్- ఒక ఒప్పం దం దిశగా ముందడుగు వేసి నట్లు వార్తలు వస్తున్నా.. అవి కుదిరేసరికి ఎన్నాళ్ల సమ యం పడుతుందో చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ యుద్ధం నాటి నుంచి 1,500-2,000 నౌక లు చిక్కుకుపోయి ఉన్నాయి. తక్షణమే హోర్ముజ్‌ను తెరిచినా.. పలు కారణాలతో షిప్పింగ్ సాధారణ స్థాయికి రావడానికి చా లా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.