19 August, 2026 | 4:01 PM

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఫోటోగ్రాఫర్ల దినోత్సవం

19-08-2026 02:20 PM

జెండా ఎగురవేసి, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న  నీలం మధు ముదిరాజ్

గతంలో నీలం మధు చేయించిన హెల్త్ ఇన్సురెన్సులు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తుచేసుకున్న ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు

పటాన్ చెరు: ఒక ఫోటో అనేది కేవలం ఒక చిత్రం కాదని, అది ఒక కాలానికి, ఒక సంఘటనకు, ఒక జ్ఞాపకానికి శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని అ ఫోటో మన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బాధ్యతను ఫోటోగ్రాఫర్లు నిర్వర్తిస్తున్నారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యాలయంలో వేడుకలకు  ఆయన  ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమం, ప్రజా ఉద్యమం, సామాజిక పరిణామం, కుటుంబ వేడుకలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని నీలం మధు అన్నారు. ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నాటి జ్ఞాపకాలను కళ్లముందు నిలిపేది ఫోటోగ్రఫీ అని పేర్కొన్నారు. అందుకే ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకుని సేవలందిస్తున్న వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని గతంలో తాను చేయించిన  హెల్త్ ఇన్సూరెన్సు కార్యక్రమాన్ని గుర్తుచేసుకున్నారు.. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం, వారి వృత్తిపరమైన అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.