19 August, 2026 | 3:09 PM

Breaking News

పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •   ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఫోటోగ్రాఫర్ల దినోత్సవం   •  

పీఏసీఎస్‌ను సందర్శించిన డీసీసీబీ సీఈఓ విశ్వేశ్వర్

19-08-2026 02:07 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)  నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీసీసీబీ సీఈఓ  విశ్వేశ్వర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ అలీబిన్ అహ్మద్, వైస్ చైర్మన్ ప్రహల్లాద్, బ్రాంచ్ మేనేజర్ వెంకట రవీందర్, సెక్రటరీ వెంకటరమణ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం సీఈఓ విశ్వేశ్వర్ సంఘంలో అందిస్తున్న వివిధ సేవలు, కార్యకలాపాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంఘం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలు అందించారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ సహకార సంఘాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.