మూసాపేటలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
మూసాపేట: మండల కేంద్రంలోని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మూసాపేట మండల ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రాపి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, మండల ఫోటోగ్రాఫర్లు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఫోటోగ్రఫీ అసోసియేషన్ జెండాను ఆవిష్కరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల తిరుపతయ్య గౌడ్, అధ్యక్షుడు తాజుద్దీన్, గ్రామ సర్పంచ్ గడ్డం మహేందర్, ఉపసర్పంచ్ ఎండీ కలీమ్, స్థానిక నాయకులు భాస్కర్ చందర్ గౌడ్, కొండయ్య, కురుమూర్తి, అసోసియేషన్ సభ్యులు: లక్ష్మణ్, వెంకటేష్, శంకరొళ్ల నరేష్ గౌడ్, రవి, బాబా, రమేష్, నిరంజన్, బాలు, సంతోష్, శశివర్ధన్, శేఖర్ తదితరులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






