4 August, 2026 | 2:49 AM

శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన వ్యక్తి అరెస్టు

03-08-2026 07:47 PM

మునిపల్లి,(విజయక్రాంతి): శాంతిభద్రతలకు ఆటంకం కలిగించిన ఓ వ్యక్తిని  మునిపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేసి డిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్సై అరవింద్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన పర్వీజ్ అహ్మద్ పటేల్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వ్యక్తిగత విషయమై గొడవ పడి దాడికి దిగాడు.

దీంతో బాధితుడు మునిపల్లి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి సంగారెడ్డి కోర్టుకు తరలించారు. ఈ మేరకు న్యాయమూర్తి లక్ష్మి కళ కేసును పరిశీలించి రెండు రోజులపాటు రిమాండ్ కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. జడ్జి ఆదేశాల మేరకు నిందితుడైన పర్వీన్ అహ్మద్ పటేల్ కంది సబ్ జైలుకు తరలించినట్లు మునిపల్లి ఎస్సై అరవింద్ తెలిపారు.