15 June, 2026 | 10:35 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఆర్‌ఓఆర్ యాక్ట్ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

04-02-2026 12:00 AM

గరిడేపల్లి, ఫిబ్రవరి 3: ఆర్‌ఓఆర్ యాక్ట్ భూభారతి రీ సర్వేతో రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు.ఆర్ ఓ ఆర్ యాక్ట్ (భూ భారతి)2024 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని గానుగబండ గ్రామంలో మంగళ వారం గ్రామపంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిగా పాల్గొని మాట్లాడుతూ రీసర్వేతో భూ రికార్డుల శుద్ధి జరిగి రైతులకు స్పష్టమైన హక్కులు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.

రీసర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా,దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు. ముందుగా గ్రామ సరిహద్దుల నిర్ణయించి అనంతరం ప్రభుత్వ భూముల సర్వే,ఆ తర్వాత రైతుల పట్టా భూముల సర్వే చేపడతామని వివరించారు. రైతులు సహకరించి రి సర్వేను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గానుగుబండ సర్పంచి కడియాల పద్మ అప్పయ్య, కొండాయిగూడెం సర్పంచ్ కందుల మంగ మ్మ కోటిరెడ్డి, సర్వే డివిజనల్ ఇన్స్పెక్టర్ వంశీ, తహసీల్దార్ స్రవంతి మండల సర్వేయర్ భాస్కర్, ఆర్‌ఐ లు ప్రవీణ్, రాంబాబు, కృష్ణవేణి గ్రామ పాలన అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.