24 August, 2026 | 3:54 AM

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

24-08-2026 12:19 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్,ఆగస్టు 23(విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోని సంపూర్ణ ఆరోగ్యవంతు లుగా ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.  ఆదివారం ముషీరాబాద్ లోని సాగర్ లాల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఆసుపత్రి అడ్మిని స్ట్రేటీవ్ డాక్టర్ సందీప్ భరద్వాజ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేట్ వైద్య సంస్థలు వ్యాపార దృక్పదంతో సేవా భావంతో పనిచేయాలని సూచించారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

అప్పుడే సమాజంలో వైద్యులకు, ఆసుపత్రికి ప్రజాధారణ పెరుగుతుందన్నారు.  అనంతరం ఎమ్మెల్యేను డాక్టర్ సందీప్ భరద్వాజ్ సన్మానించారు.  ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, వైద్యులు డాక్టర్ కుసుమాం జలి, ఆసుపత్రి నిర్వాహకులు సుబ్బారావు, శరతుప్తా, బీఆర్‌ఎస్ భోలక్ పూర్ డివిజన్, రాంనగర్,

ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ రావు, శంకర్ ముదిరాజ్, శ్రీధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఆర్.  మోజేస్, టి.  సోమన్, ఆకుల అరుణ్ కుమార్, టెంట్ హౌస్ శ్రీనివాస్, నేత శ్రీనివాస్, రవియాదవ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.