24 August, 2026 | 2:54 AM

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఇష్టారాజ్యం!

24-08-2026 12:05 AM
  1. మల్కాజిగిరి తహసీల్దారు కార్యాలయంలో సర్టిఫికేట్ల జారీలో ఆలస్యం
  2. పట్టించుకోవాలని ప్రజల విజ్ఞప్తి 

మల్కాజిగిరి, ఆగస్టు  23 (విజయక్రాం తి): మల్కాజిగిరి తహసీల్దారు కార్యాల య ంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వ్యవహా రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తహసిల్దార్తో పాటు పలువురు ఉ దో ్యగులను  సిబ్బందిని బదిలీ చేసినప్పటికీ మ ండల కార్యాలయంలో కింది స్ధాయి సి బ్బ ంది పని తీరు ఏ మాత్రం మారడం లేదు. కార్యాలయంలో పని చేస్తున్న వారి అవినీతిపై బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. 

ఇక్కడ పని చేసే సిబ్బంది, తహసీల్దార్  ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తమకు నచ్చినట్లుగా విధులు నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.  ఇందులో పని చేసే   సిబ్బం ది తమ ఇష్టారాజ్యంగా వ్య వహరిస్తుండటంతో  ప్రజలు తీవ్ర ఇబ ్బందులు పడుతున్నా ఉన్నతాధి కారులు ప ట్టించుకోక పోవడంతో వీరి పని తీరుపై ప లువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, కులం, నివా సం తదితర అనేక సర్టిఫికెట్లను నిర్ధిష్ట సమయంలో జారీ చేయాల్సిన సంబంధిత అధికారులు, సిబ్బందితో ఉన్న అమ్యామ్యాల ఒప్పందంతో కాలయాపన చేస్తుండటంతో విద్యార్థులు, నిరు ద్యోగులు తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్ర భుత్వం సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేకంగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టినప్పటికీ, క్షేత్ర స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అధికారులు, సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో  జారీలో కాలయాపన జరు గుతుందని ఆందోళన చెందిన దరఖాస్తుదారులు తమ సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యా లయాల చుట్టూ తిరుగుతున్నారు. 

కిందిస్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం

తహసిల్దార్ కార్యాలయంలో కింది స్ధా యి ఉద్యోగులు, సిబ్బంది తీరుతో విద్యార్థు లు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం వస్తున్న నిరుద్యోగుల విద్యార్థు లతో సరేనా పేరులో స్పందించట్లేదని ఆరోపణ విలువెత్తుతున్నాయి. దీంతో అవసరా ర్థులు రోజుల తరబడి తహసిల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదర్శన చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డదనీ బాధితులు వాపోతున్నారు.

బయట నుంచి బయటికి..

ఈ విషయం గురించి స్థానిక తహసిల్దారుకు ఫిర్యాదు చేయాలనుకుంటే దరఖా స్తుదారులను అధికారులు బయట నుంచి బయటికి పంపిస్తున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి.  ఇకనైనా కలెక్టర్ స్పందించి తగి న చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  మండల తాసిల్దార్ కార్యాలయాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేయాలని, కింది స్ధాయి ఉదో ్యగులు, సిబ్బంది పని తీరు, సర్టిఫికెట్‌ల జారీలో  జరుగుతున్న కాలయా పనను గుర్తించి తమ సమస్యలను పరిష్క రించాలని దరఖాస్తుదారు లు విజ్ఞప్తి చేస్తున్నారు. 

మా దృష్టికివస్తే చర్యలు తీసుకుంటాం..

ఇలాంటి సమస్యలు ఉన్నాయని నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం లేకుండా చూస్తాం.

 సుజాత, తహసీల్దార్, మల్కాజిగిరి