24 August, 2026 | 2:06 AM

ఆర్యవైశ్యుల సేవలు స్ఫూర్తిదాయకం

24-08-2026 12:18 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్,ఆగస్టు 23(విజయక్రాంతి):  ఆర్యవైశ్యులు వ్యాపారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు స్పూర్తిగా నిలుస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే  ముఠా గోపాల్ పేర్కొన్నారు.  ఆదివారం ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ భవనంలో గాంధీనగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ యాదగిరిలు గాంధీనగర్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తాతో పాటు కార్యవర్గాన్ని పదవీబాధ్యతల ప్రమాణస్వీకారాన్ని నిర్వహించారు. 

అనంతరం అతిథులు వారిని ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ  గాంధీనగర్లో ఆర్యవైశ్య భవన నిర్మాణానికి తనవంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.  ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉన్నప్పుడే తమ న్యాయమైన హక్కులను సాధించుకోవచ్చన్నారు. ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, చైర్మన్ సుజాతలు మాట్లాడుతూ  ఆర్యవైశ్యులు వ్యాపారంతో పాటు రాజకీయంగా రాణించాలని సూచించారు.  వైశ్యులు సేవా కార్యక్రమాలలో ముందుకు సాగుతూ ఐక్యతను పెంపొందించుకోవాలని సూచించారు. 

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ  ఎన్నికల్లో ఓట్లు మనవి, డ బ్బులు సహకారం మనవి ప్రజా ప్రతినిధులను నమ్మి ఎన్నికల్లో గెలిపిస్తున్నామని, ఆ యా ప్రజాప్రతినిధులు ఆర్యవైశ్యుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం సంఘం నూతన అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా అతిథులకు మెమోంటోలు ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు.  ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎ స్ యువ నాయకుడు ముఠా జైసింహ, మా జీ చైర్మన్ కోలేటీ దామోదర్ గుప్తా, ముషీరాబాద్ ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ గంజి రాజమౌళిగుప్తా, బీజేపీ మహాంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్  రామ్, గాంధీనగర్ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు కళావతి, సుజాత రావు, కోశాధికారి ఎర్రం శ్రీలక్ష్మి, సంఘం ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, కోశాధికారి రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.