పోలీసుల తనిఖీలు
నిర్మల్ ఆగస్టు 23 ( విజయ క్రాంతి) నిర్మ ల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామం లో ఆదివారం పోలీసులు నిర్బంధ తనిఖీలు డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 83 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటో, ఒక టాటా మ్యాజిక్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ.. గ్రామంలో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంట నే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
యువత గంజాయి, డ్రగ్స్ వం టి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి సంబంధించిన ధ్రు వపత్రాలు ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్త్స్రలు లింబాద్రి, శ్రీకాంత్, గణేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






