28 April, 2026 | 7:57 PM

ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

28-04-2026 06:08 PM

సర్పంచ్ కొత్త గురువయ్య

కోదాడ,(విజయక్రాంతి): ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు ముఖ్యంగా నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోదాడ మండల గ్రామ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, చిమ్మిరాల గ్రామపంచాయతీ సర్పంచ్ కొత్త గురువయ్య అన్నారు. మంగళవారం గ్రామములోని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సూర్యాపేట ఏరియల్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించి  మాట్లాడారు. పరిసర గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బండ్ల సైదులు, గ్రామ కార్యదర్శి వీరబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు