15 June, 2026 | 11:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి

05-12-2025 02:02 AM
  1. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పటిష్ట బందోబస్తు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు అవగాహనలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

మంథని, డిసెంబర్ 4(విజయ క్రాంతి) జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొవాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్పో  ప్రజలకు అవగాహనలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. బుధవారం ముత్తారం, రామగిరి మండలంలోని గ్రామాలలో గోదావరిఖని ఏసిపి మడత రమేష్, మంథని సిఐ రాజుతో కలిసి పాల్గొన్నారు. 

ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, ఓడేడు, అడవి శ్రీరాంపూర్, కేశనపల్లి, రామగిరి మండలంలోని రామయ్యపల్లి తదితర  గ్రామాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) పై అవగాహన క కార్యక్రమాన్ని ముత్తారం ఎస్‌ఐ  రవి కుమార్, సిబ్బంది తో  గ్రామాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులోడీసీపీ పాల్గొని మాట్లాడుతూ స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, గొడవలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు జరగాలని దానికి అందరూ పోలీస్ వారికీ సహకరించాలని,  పోలింగ్ రోజు,

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పెద్దపల్లి జోన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల వాటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పటిష్టమైన బందోబస్తులు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, నిషేధిత చర్యలు, డబ్బు మద్యం పంపిణీ, బెదిరింపులు, పోలింగ్ బూత్ ల వద్ద ప్రభావం చూపే చర్యలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. ఎలాంటి అక్రమ చట్ట వ్యతిరేకమైన,

ఎన్నికల ఉల్లాంఘాన చర్యలు జరిగిన వెంటనే  డయాల్ 100, స్థానిక పోలీస్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ఎవ్వరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు గొడవలకు పాల్పడ కుండా అభ్యర్థులు,  గౌరవించాలని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, హింసాత్మక చర్యలు, ప్రతిష్టాభంగ ప్రచారాలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే కేసులు నమోదు చేస్తామని, సోషల్ మీడియా ద్వారా హానికరమైన ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు షేర్ చేసిన కూడా బాధ్యులపై చర్యలు తప్పమన్నారు. రాత్రి వేళలో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని, నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు.డీసీపీ వెంట  ముత్తారం ఎస్‌ఐ రవి కుమార్, రామగిరి ఎస్‌ఐ శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.