21 August, 2026 | 12:36 AM

మల్లన్న ఆఫీసుకు ప్రజల క్యూ

21-08-2026 12:27 AM

సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న కృషి

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాం తి): ప్రజల సమస్యల పరిష్కారానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం మారింది. నిత్యం వందలాది మంది ప్రజలతో కార్యాలయం కిటకిటలాడుతున్న ది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న దృష్టికి తీసుకువస్తున్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మా ట్లాడుతున్న మల్లన్న.. వారి అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. 

నేడు మెదక్ జిల్లా పర్యటన

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం మెదక్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలు, మండల కేంద్రాల్లో పార్టీ జెండా గద్దెల ఆవిష్కరణలు నిర్వహించడంతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పా ర్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు ఎంజీపీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించనున్నారు.