21 August, 2026 | 1:01 AM

పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి

21-08-2026 12:28 AM
  1. రైల్వే జీఎంకు ఎంపీల వినతి
  2. రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్ష
  3. పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్ల మెంట్ సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, గోడెం నగేష్, కడియం కావ్య, వంశీకృష్ణ, వద్దిరాజు రవిచంద్ర, అనిల్ కు మార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, కుందూ రు రఘువీర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ప్రాజెక్టుల గురించి రైల్వే జీఎం సంజయ్ కు మార్ శ్రీవాస్తవ వివరించారు. ఈటల రా జేందర్ మాట్లాడుతూ గతంలో రైల్వే పను లు చేయాలంటే కేంద్రం - రాష్ట్రం కలిపి ని ధులు ఖర్చు చేసేవని, ప్రధాని నరేంద్ర మో దీ సహకారంతో వందశాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుందన్నారు. ఇప్పుడు ఆర్‌యూబీ, ఆర్‌వోబీ, రైల్వే స్టేష న్లు, ఎంఎంటీఎస్ రైళ్లు, చివరికి అవసరమైన భూసేకరణ కూడా రైల్వే శాఖనే చేపడుతుందన్నారు.

రైళ్లవేగం అంచనా వేయలేక చాలా మంది ప్రజలు రైలు పట్టాలు దాటుతూ ప్ర మాదవశాత్తు చనిపోతున్నారని, దీనిని నివారించడానికి సాధ్యమైనన్ని ఎక్కువ ఆర్‌యూ బీల నిర్మాణం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. బుల్లెట్ ట్రైన్లు మంజూ రు అయ్యాయి కానీ రూట్ ఇంకా ఫైనల్ కాలేదు..కాబట్టి తమ భూమి పోతుందనే ఆందోళన చెందవద్దని ప్రజలకు ఆయన విజ్ఞ ప్తి చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకువచ్చి సహకరించాలని కోరారు.

ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ కొవిడ్ స మయంలో తొలగించిన పలు రైళ్ల స్టాపులను పునరుద్ధరించాలని కోరారు. కృషాె్ణ వికారాబాద్ లైన్ డీపీఆర్ పూర్తవడంతో వా టి పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. గద్వాల - లైన్ ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉంది దానిని పరిశీలించాలని తెలిపారు.

జడ్చర్ల - వికారాబాద్ - కొత్త లైన్ కోసం పరిశీ లించాలని అధికారులను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్ కోసం ప్రత్యేక కార్పొరే షన్ ఉందన్నారు. బుల్లెట్ ట్రైన్‌లు ఎస్‌సీఆర్‌కు సంబంధంలేదని పేర్కొన్నారు. పశ్చిమ వైపు ఈదుల నాగులపల్లిలో కూడా టెర్మినల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య మా ట్లాడుతూ కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే జీఎంను కోరారు.