21 August, 2026 | 1:12 AM

బీసీలకు ప్రత్యేక కుల సంకేతం ఇవ్వాలి

21-08-2026 12:31 AM
  1. ఎంపిక జాబితా లేకుండా గణన చేస్తే అన్యాయమే
  2. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
  3. మాజీ పూర్ణచంద్రరావు 
  4. ప్రభుత్వాలు హామీలు ఇచ్చి విస్మరిస్తున్నాయి
  5. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

ముషీరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాం తి): దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో బీసీ కులాలను శాస్త్రీయంగా, కచ్చితంగా నమోదు చేయాలంటే ప్రతి కులానికి ప్రత్యేక కుల సంకేతం కేటాయించి, రాష్ట్రాలవారీగా ప్రామాణిక కులాల జాబితాను రూపొందించాలని మాజీ డీజీపీ, అఖిల భారత బహు జన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డా. జె. పూర్ణచంద్రరావు, డీఎంకే రాజ్యసభ సభ్యుడు పి విల్సన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమా ండ్ చేశారు.

ఈ విధానం రూపొందించే వరకు కులాల నమోదును ప్రారంభిం చరాదని, లేనిపక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనగణనలో ఓబీసీల కు జరుగుతున్న అన్యాయాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు.

డా.జె.పూర్ణచంద్రరావు మాట్లాడు తూ.. ఎస్సీ, ఎస్టీల విషయంలో జనగణన అధికారి వద్ద ముందుగానే నిర్దిష్ట కులాల జాబితా ఉంటుందని, అందులో సంబంధిత కులాన్ని ఎంపిక చేయడం ద్వారా తప్పులకు అవకాశం లేకుండా నమోదు చేయవచ్చని తెలిపారు. “ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న విధానాన్నే బీసీలకు ఎందుకు అమలు చేయరు?” అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ప్రతి రాష్ర్టంలో ఇప్పటికే అధికారిక బీసీ కులాల జాబితాలు ఉన్నాయని చెప్పారు.

ఒక్కో రాష్ర్టంలో సుమారు 140 నుంచి 150 వరకు బీసీ కులాలు ఉంటాయని, వాటిని ముందుగానే కంప్యూటర్‌లో పొందుపరిచి, ప్రతి కులానికి ప్రత్యేక సంకేతం ఇవ్వడం ఏ మాత్రం కష్టం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం 2011లో చేసిన తప్పులను ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పునరావృతం చేయకూడదన్నారు.

రాజ్యసభ సభ్యుడు పి. విల్సన్ మాట్లాడుతూ.. 1931 కులగణనలో దేశవ్యాప్తంగా 4,147 కులాలను గుర్తించార ని చెప్పారు. అనంతరం మండల్ కమిషన్ దే శంలోని 400కు పైగా జిల్లాల్లో అధ్యయ నం చేసి 3,743 సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలను గుర్తించిందన్నారు. బీసీల జనాభా సుమారు 52 శాతంగా మ ండల్ కమిషన్ అంచనా వేసిందని తెలిపారు.

కులాల వారీగా ఖచ్చితమైన లెక్కలు లేవు: శ్రీనివాస్‌గౌడ్

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో బీసీల జనాభా సుమారు 80 కోట్లు ఉన్నప్పటికీ, వారి కులాల వారీగా ఖచ్చితమైన జనాభా లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం విషయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే చట్టబద్ధమైన జనాభా లెక్కలు లేవంటూ కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్లను ప్రశ్నిస్తున్నారని, మరోవైపు జనగణనలో బీసీల కులగణన చేపడతామని ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆలస్యం చేస్తున్నాయని అన్నారు.

ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా కులాల వారీగా, కుటుంబాల వారీగా జనాభా లెక్కలు పారదర్శకంగా సేకరించాలన్నారు. దేశంలో జంతువుల సంఖ్యకు సైతం లెక్కలు ఉన్నప్పటికీ, బీసీ కులానికి ఎంత జనాభా ఉందో ఖచ్చితమైన లెక్కలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు, విద్యార్థి నాయకుడు డా. జి. కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. కులగణన కేవలం జనాభా లెక్కలకే పరిమితం కాకుండా విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు వంటి సామాజిక న్యాయ విధానాలకు శాస్త్రీయ ఆధారం కావాలని కోరారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రాకేష్ దత్త, జయంత్ యాదవ్ పాల్గొన్నారు.