21 August, 2026 | 12:13 AM

ముషీరాబాద్‌లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు

21-08-2026 12:00 AM
  1. అనుమతులకు మించి బహుళ అంతస్తుల నిర్మాణాలు
  2. అధికారుల అండదండలతో కాంట్రాక్టర్ల హల్చల్
  3. ఆమ్యామ్యాల ఉచ్చులో టౌన్ ప్లానింగ్ అధికారులు 
  4. చర్యలు తీసుకోవాలని స్థానికుల వేడుకోలు

ముషీరాబాద్,ఆగస్టు20 (విజయక్రాం తి): ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతునా ్నయి.  నియోజకవర్గంలోని ముషీరాబాద్,  కవాడిగూడ, గాంధీ నగర్, భోలక్ పూర్, రాంనగర్, అడిక్మెట్ డివిజన్లలోని కాలనీలు, బస్తీలలో  జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభా గం నుంచి పొందిన అనుమతులకు భిన్నం గా, అనుమతించిన అంతస్తులకు మించి బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కొంతమం ది కాంట్రాక్టర్లు నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని, వారికి సంబంధిత అధికారుల అండదండ లు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ అనుమతులు, సెట్బ్యాక్లు, భవన ఎ త్తు తదితర నిబంధనలను ఉల్లంఘిస్తూ ప నులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆమ్యామ్యాల ఉచ్చులో టౌన్ ప్లానింగ్?

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 

ప్రజలకు ఇబ్బందులు

అనుమతులకు మించి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల కారణంగా రహదారులపై రద్దీ, పార్కింగ్ సమస్యలు, డ్రైనేజీపై అదనపు భారం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్లో ఇలాంటి నిర్మాణాలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

ముషీరాబాద్ పరిధిలో కొనసాగుతున్న అనుమానాస్పద, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన అనుమతులను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అలాగే టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై కూడా ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిహెచ్‌ఎంసి ముషీరాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీని వివరణ కోరేందుకు ‘విజయక్రాంతి‘ ప్రతినిధి  ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.