21 August, 2026 | 1:13 AM

జీవో 97ను రద్దుచేయాలి

21-08-2026 12:32 AM
  1. విద్యార్థుల నిరసనను పట్టించుకునే నాథుడే లేరు
  2. విద్యార్థులపై దాడిచేసిన సీఐ రఘుపతిరెడ్డిని సస్పెండ్‌చేయాలి
  3. చర్చల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
  4. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జీవో 97ను వెంట నే రద్దుచేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్‌చేశారు. జీవో 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మద్దతు తెలిపారు. గురువారం తెలం గాణ భవన్‌లో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తరగతి గదుల్లో ఉండాల్సిన పేద విద్యార్థులు నేడు రోడ్లపైకి వచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. జీవో 97తో ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థు లు తెలంగాణ భవన్‌కు తరలివచ్చారని వెల్లడించారు.

వేల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తున్నప్పటికీ వారి సమస్యలను పట్టించుకునే నాథుడు లేకుం డా పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ‘జనతా గ్యారేజ్’గా మార్చారని, ప్రజా సమస్యలపై పోరాటాలకు ఇది వేదికగా నిలుస్తున్నదని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల సీఐ రఘుపతిరెడ్డి వ్యవహరించిన తీరును తీవ్రం గా ఖండించారు.

విద్యార్థుల గొంతు పట్టుకుని హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరో పించిన ఆయన.. రఘుపతిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేశారు. విద్యార్థులపై అణచివేత చర్యలకు పాల్పడకుండా వారి సమస్యలను ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ రాసి ఇంజినీరింగ్ కో ర్సుల్లో చేరడంలో తప్పేముందని ప్రశ్నించా రు. వనపర్తిలో పాలిటెక్నిక్ చదివిన సీఎం రేవంత్‌రెడ్డి.. అదే విద్యా విధానంలో చదువుతున్న విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకో వాలని పేర్కొన్నారు.

ఆకునూరి మురళి కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం జీవో 97ను తీసుకొచ్చిందని, దాని వల్ల విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిగణన లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేశవరావును మేధావిగా పేర్కొనే సీఎం రేవంత్‌రెడ్డి.. అదే కేశవరావు పాలిటెక్నిక్ విద్యార్థులను బెదిరిస్తున్నారని విమర్శించారు. సీఎం తన విదేశీ పర్యటనను రద్దు చేసుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను స్వయంగా వి నాల డిమాండ్‌చేశారు.