శాతవాహనకు మరో ఆరు పీజీ కోర్సులు
ఫలించిన ఎస్ యు విసి కృషి
కరీంనగర్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయానికి తాజాగా ఆరు పి జి కోర్సులు మంజూరు అయ్యాయి. ఆరు కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. శాతవాహన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న 191 కళాశాలలు డిగ్రీ, పిజి, వృత్తివిద్యా కోర్సులను అందిస్తున్నాయి. ఇందులో 22 పిజి, 3 వృత్తివిద్యా డిగ్రీ కోర్సులు, ఇతర డిగ్రీ కోర్సులు (బిఎ, బి.కామ్., బి.ఎస్.సి) ఉన్నా యి.
బి.ఫార్మసీ, ఎంఏ (అర్థశాస్త్రం, ఇంగ్లీష్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ), ఎంబిఏ, ఎం.కామ్ వంటి కోర్సులను, ఎం.ఎస్సీ. (వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, కంప్యూటర్ శా స్త్రం, ఆహారశాస్త్రం & సాంకేతికత, ఇన్స్ట్రుమెంటేషన్ భౌతికశాస్త్రం గణితశాస్త్రం) మొదలైన కోర్సులు కరీంనగర్ లోని విశ్వవిద్యాలయ కళాశాల, గోదావరిఖనిలోని విశ్వవిద్యాలయ పిజి కళాశాల లో ఉన్నాయి. తాజాగా మరో 6 కొత్త కోర్సులు వచ్చాయి.
శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ ప్రత్యేక చొరవ, నిరంతర శ్రమ ఫలితంగా 202627 విద్యాసంవత్సరం నుండి విశ్వవిద్యాలయంలో 6 నూతన పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులను రెగ్యులర్ విధానంలో ప్రారంభించేందుకు బాటలు పడ్డాయి.
విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వ కళాశాల విద్య కమిషనర్ ఎ. దేవసేన, రెగ్యులర్ ప్రాతిపదికన కోర్సులను మంజూరు చేశారు.
- నూతన రెగ్యులర్ కోర్సుల వివరాలు...
ఎం.బి.ఏ (రిటైల్ మేనేజ్మెంట్) సీట్లు: 60 (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్, కరీంనగర్)
ఎం.కామ్ (ఫైనాన్స్ టెక్నాలజీ) సీట్లు: 40 (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్, (కరీంనగర్)
ఎం.ఎస్సీ (ఫోరెన్సిక్ సైన్స్) సీట్లు: 30 (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, కరీంనగర్)
ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్ సీట్లు: 30 (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, కరీంనగర్)
ఎం.ఎస్.డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) సీట్లు: 40 (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆరట్స్ & సోషల్ సైన్స్, కరీంనగర్)
ఎం.బి.ఏ (బిజినెస్ అనలిటిక్స్) సీట్లు: 60 (యూనివర్సిటీ పీజీ కాలేజ్, గోదావరిఖని).
విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులను నిర్వహించేందుకు ప్రయత్నం
విశ్వవిద్యాలయంలో బిజినెస్ అనలిటిక్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ , ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ సైన్స్ వంటి ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను రెగ్యులర్ పద్ధతిలో అందించడం ద్వారా గ్రామీణ, స్థానిక విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
విశ్వవిద్యాలయం అనేక కొత్త కోర్సులను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ తెలంగాణలో మెరుగైన ఉన్నత విద్యను అందించడానికి ముందుకు సాగుతుంది. విశ్వవిద్యాలయ క్యాంపస్ లోని కామర్స్ కళాశాలలో రెండు కొత్త కోర్సులు, సైన్స్ కళాశాలలో రెండు కోర్సులు, ఆరట్స్ కళాశాలలో ఒక కోర్సు, గోదావరిఖని పీజీ కళాశాలలో మరొక కొత్త కోర్సు తో ఉన్నత విద్యకు పునాదులు పడ్డాయి.
ఎస్‌యూవిసీ ఆచార్య ఉమేష్ కుమార్






