21 August, 2026 | 1:14 AM

ఊరు ఊసు లేదు.. ఎమ్మెల్యే పద్మావతి పేరు లేదు!

21-08-2026 12:26 AM
  1. రామలక్ష్మిపురంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
  2. అక్కడి శిలాఫలకంలో ఊరు, ఆమె పేరు మరిచిన అధికారులు!

కోదాడ, ఆగస్టు 20 (విజయక్రాంతి): పేరు మరవడానికి ఆమె సాదాసీదా మహిళ కాదు.. ఓ ఎమ్మెల్యే. అందునా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి. అయితే ఆమె తన నియోజకవర్గమైన కోదాడలోని రామలక్ష్మీపురం అనే గ్రామం నుంచి మిర్యాలగూడ పీడబ్ల్యూడీ రోడ్డు హుజూర్‌నగర్ సమీపం వరకు 4 కిలోమీటర్ల మేర డబు ల్ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.

అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకం లో మాత్రం అసలు ఆ ఊరు పేరును, ఎమ్మెల్యే పద్మావతి పేరును అధికారులు ఎగరగొట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ శిలాఫలకంలో ఆ గ్రా మం పేరు, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పేరు లేకపోవడంపై స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అధికారులు అస లు ఆ ఊరి పేరు, ఎమ్మెల్యే పద్మావతి పేరును ఎగరగొట్టడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమా.. లేక వారి అత్యుత్సాహానికి నిదర్శనమా అని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.