20 August, 2026 | 11:37 PM

రాజీవ్ గాంధీ దేశానికే ఆదర్శం

20-08-2026 11:28 PM

* ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

* మండల అధ్యక్షుడు గజ్జల రాజు

ముస్తాబాద్,(విజయక్రాంతి): స్వర్గీయ మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో రాజీవ్ విగ్రహానికిపూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని వారికి ఇవే మా ఘన నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని యువతకు ఎన్నో అవకాశాలను కల్పించిన నాయకుడన్నారు.

కేవలం 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి, దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో యువతకు కీలకమైన పాత్ర అందించాలని తెలిపారు. సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని నేడు మనం చూస్తున్న సమాచార సాంకేతిక, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఎంతో కీలకమైనవి.గా ఇప్పుడు మనం చూస్తున్నామని తెలిపారు.అదేవిధంగా గ్రామీణ భారత అభివృద్ధికి రాజీవ్ గాంధీ  ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని గ్రామ పంచాయతీలకు అధికారాలు, నిధులు అందించడంతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేశారన్నారు.

వారి  ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి మనం అందించే నిజమైన నివాళి.అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్రెడ్డి మాజీ ఎంపిటిసి గుండెలి శ్రీనివాస్ ఆరుట్ల మహేష్,ఆత్మ డైరెక్టర్లు కొండల్ రెడ్డి,టి శ్రీనివాస్,బీసీ సెల్ ఆగుళ్ల రాజేశం,ఉచ్చుడి బాల్రెడ్డి,sc సెల్ కాంపల్లి శ్రీనివాస్,కొప్పు రమేష్, వేముల సత్యం, మిరుదొడ్డి భాను,రంజాన్ నరేష్,ధీటి నర్సింలు, కర్ణాకర్, గూడెం బాలయ్య, ఆంజనేయులు, షాదుల్ పాప,బాలసాని శ్రీనివాస్, ఏద్దండి మహేందర్,పుల్లూరి రవి, భాను, సంతోష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.