20 August, 2026 | 11:41 PM

వ్యక్తి అదృశ్యం

20-08-2026 11:14 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): షాపుకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్ల లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగిచర్ల వెంకట సాయి నగర్ కాలనీకి చెందిన పోతుకానీ కరుణాకర్ (40)  ఈనెల 17న సాయంత్రం 05.30 గంటల సమయంలో బోడుప్పల్‌లోని తన షాప్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో, చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య కవిత మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు  చేపట్టారు, సదరు వ్యక్తి వివరాలు తెలిసిన వారు లేదా అతని ఆచూకీ తెలిసిన వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ  జలేందర్ రెడ్డి తెలిపారు.