డ్రైనేజీలు లేక.. గుంతల్లో మురికి నీరు
దోమలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
తూప్రాన్, జులై 3: తూప్రాన్ మండలం ఘనపూర్ ఎస్సీ కాలనీ, రెండవ వార్డులో మురికి నీరు గుంతలలో పూర్తిగా నిండి పోయి ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ కాలనీలో ప్రధాన సమస్యగా మురికి కాలువల్లో డ్రైనేజీ వాటర్ పూర్తిగా పేరుకుపోయి దోమలు, ఈగలు వివిధ రకాల కీటకాలు వాటిపైన వాలి ఇళ్లలోకి రావడం జరుగుతుంది. తద్వారా దోమలు చిన్నపిల్లలను కుట్టి రోగాల బారిన పడేస్తున్నాయి.
ఇదే కోణంలో రెండవ వార్డులో మురికి కాలువ మురికి నీటితో నిండిపోయి అవస్థలకు గురవుతున్నామని ఎన్నికల సమయంలో డ్రైనేజీ సమస్యలు తీరుస్తామని ప్రజా ప్రతినిధి హామీ ఇచ్చారని రెండోవార్డు కాలనీ వాసులు తెలిపారు. ఈ సమస్యలన్నీ సర్పంచ్, గ్రామ పంచాయతీ అధికారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన సమస్య తీరలేదని గ్రామంలోని ప్రజా ప్రతినిధులు అసలు ఏం చేస్తున్నట్లు అని ఎస్సీ కాలనీలో యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తీవ్రతరం అయితే వర్షాకాల సీజన్లో ఎస్సీ కాలనిలో ప్రజలు కలరా, మసూచి, బోదకాలు వివిధ రకాల రోగాలు ప్రబలి వ్యాధుల భారిన పడి ఆసుపత్రిలో చేరే ప్రమాదం పొంచి ఉందని, తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఎస్సీ కాలనీ యువకులు పాల్గొన్నారు.






