30 July, 2026 | 4:43 PM

కూలిన ఇల్లు.. కాలనీలలో నిలిచిన నీరు

30-07-2026 03:34 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలో కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు మండల కేంద్రంలో నివాసముంటున్న వికలాంగుడైన దాసరి గంగయ్య ఇల్లు కూలిపోవడంతో ఇంటిని కోల్పోయాడు. దీంతో ప్రభుత్వం బాధిత వికలాంగుడిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇక బస్టాండు సమీపంలో మురికి కాలువల నిర్మాణం ఒకేవైపు ఉండడంతోనీరంతా రోడ్లపై ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఒకే వైపు మురికి కాల్వ ఉండడం మరోవైపు లేకపోవడంతో బస్టాండ్ లోని వైన్స్ షాపు నుండి నీరు ఉదృతంగా ప్రవహించి నూతనంగా నిర్మించుకున్న కాలనీలోకి రావడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటి నుండి బయటకు రావాలంటే నిలిచిపోయిన వర్షపు నీటిలో నుండి వెళ్లాల్సి వస్తుందని సమీప గృహాల వారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. గ్రామపంచాయతీ వారు తక్షణమే మురుగునీటి కలవల నిర్మాణం చేపట్టి వరద నీరు తమ కలనేరులో కి రాకుండా చూడాలని కోరుతున్నారు. మరోవైపు వైన్స్ షాప్ సమీపంలోని గృహాల నుండి వస్తున్న మురుగు నీరంతా రోడ్డుపైకి వస్తున్నాడంతో రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర వాహనాల వారు కాలినడకన వెళ్లే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పంచాయతీ అధికారులు సమస్యను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.