30 July, 2026 | 4:48 PM

అప్రమత్తంగా ఉండాలి

30-07-2026 03:54 PM

- ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు

జన్నారం,(విజయక్రాంతి): వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. గురువారం మధ్యాహ్నం కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. కడెం ప్రాజెక్టులో 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున దిగువ ప్రాంతాల్లో ముంపు సంభవించే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.