భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే
బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గంలో గత రెండు రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని గ్రామాల సమీపంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నందున దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా అధికార యంత్రాంగం సైతం అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
జలపాతాల వద్ద నీటి కుంటల వద్ద అత్యుత్సాహం కనబరచవద్దని పేర్కొన్నారు. పోలీసు ,రెవెన్యూ శాఖల అధికారుల సైతం ప్రజలకు ఇప్పటికే పలు సూచనలు చేశారని నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు .అంతేగాక కాలనీలలోకి నీళ్లు వస్తే స్థానిక అధికారుల దృష్టికి తేవడంతో పాటు తన దృష్టికి తీసుకురావాలని ఈ విషయంలో కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.






