14 March, 2026 | 12:01 AM

పదవ తరగతి విద్యార్థులకు పెన్స్, ప్యాడ్స్ అందజేత

13-03-2026 09:35 PM

చిట్యాల,(విజయక్రాంతి): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండ్రాంపల్లిలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గురువారం పరీక్షా సామాగ్రిని (పరీక్ష ప్యాడ్స్ ,పెన్స్, పెన్సిల్, ఎరేజర్, శార్పనర్, స్కేలు, హాల్ టికెట్ కవర్స్) గ్రామవాసులైన దోర్నాల కృష్ణ, పద్మ దంపతులు, వారి కుమారుడు దోర్నాల వంశి ఆర్థిక సహకారంతో చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మామిడి రవికుమార్ చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రమాదేవి అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిట్యాల ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని విద్యార్థులని కోరారు. తాను కూడా ప్రభుత్వ పాఠశా లలోనే  చదువుకొని ఈ స్థాయికి వచ్చానని, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మంచి ప్రావీణ్యం కలిగి మంచి బోధన చేస్తారని ఉత్తమ క్వాలిఫికేషన్ కలిగిన ఉపాధ్యాయుల చేత బోధన ఉంటుంది కాబట్టి పిల్లలంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, విద్యార్థులంతా కూడా చెడు వ్యసనాలకు లోను గాకుండా గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.

కాబట్టి మీరంతా కూడా మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడానికి పదవ తరగతి మొదటి స్టెప్ అని, విద్యార్థులకు అనేక సూచనలు సలహాలు అందిస్తూ 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మస్రం శ్రీనివాసులు, మందుగుల  అండాలు,  పనకంటి వెంకట్ రావు, అబ్జల్ షరీఫ్, ఉప్పల పద్మ, గుత్త రాంరెడ్డి, సల్ల  వెంకటరమణ, జిల్లోజు  వెంకటేశ్వర్లు, ఎలుగు  నరసింహ, ప్రణయ, రేణుక తదితరులు పాల్గొన్నారు.