13 March, 2026 | 10:58 PM

గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదు

13-03-2026 09:40 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పిజి గ్యాస్ కొరత లేదని వినియోగదారులు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నిల్వలను అందుబాటులో ఉంచినట్లు, ఎల్పిజి సిలిండర్లు పక్కదారి పట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సరైన విధంగా సిలిండర్లు ఉపయోగించేటట్లు చూడడానికి ప్రత్యేక మానిటరింగ్ కమిటీ నియమించినట్లు తెలిపారు.

ప్రజలు ఎవరు కూడా ముందస్తు బుకింగ్ లు అవసరం లేదని, వినియోగదారుల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు తెలిపారు. బుకింగ్ లు నిలువలపై రోజువారి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని, అటువంటివి ఎక్కడైనా సంభవిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. దీని కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇది జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆధ్వర్యంలో కొనసాగుతుందని 8500844365 నెంబర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మరాదని తెలిపారు.