8 August, 2026 | 1:14 AM

పెండింగ్ కేసులు సత్వరం పరిష్కరించాలి

08-08-2026 12:12 AM

జిల్లా ఎస్‌పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

నాగర్ కర్నూల్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : జిల్లాలో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు అన్ని కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారి క్రైమ్ రివ్యూ సమావేశంలో మిస్సింగ్, ఎస్సీ/ఎస్టీ, గ్రేవ్, నాన్-గ్రేవ్, సైబర్ కేసుల పురోగతిని సమీక్షించారు.

సీసీటీఎన్‌ఎస్ డేటాను సకాలంలో నవీకరించాలని, డయల్-100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా ఎన్సీఆర్పి పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, నకిలీ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారితోపాటు జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నారు.